చంద్రముఖి 2 సినిమాను ఈ వినాయక చవితికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ మొత్తం కూడా రెడీ చేసుకున్న తరుణంలోనే ఊహించని విధంగా మళ్లీ విడుదల తేదీని మార్చుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కారణమైతే సిజి గ్రాఫిక్స్ వర్క్ అని చెబుతున్నారు కానీ అసలు నిజమైతే అది కాదు. సినిమాకు సంబంధించిన అన్ని పనులు దాదాపు వారం క్రితమే ఫినిష్ అయ్యాయి.
ఇప్పుడు సెన్సార్ పనుల కోసం సినిమాను రెడీ చేయగా మళ్లీ ఒక్కసారిగా ఆలోచన మార్చుకున్నారు. సినిమా ఔట్ ఫుట్ విషయంలోనే చిత్ర యూనిట్ సభ్యులు అంతగా ఆసక్తిగా లేకపోవడంతో మళ్లీ ఎడిటింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. దానికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పై కూడా ట్రోలింగ్ అయితే గట్టిగానే వచ్చింది.
అందుకే దర్శకుడు ఎడిటింగ్ కోసం మరికొంత సమయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే మళ్ళీ సినిమాను సెప్టెంబర్ 28 కి ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడే స్కంద కూడా విడుదలవుతోంది. అప్పుడు హాలిడేస్ కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకోవచ్చు అని చంద్రముఖి టీం అయితే ఆలోచిస్తోంది. మరి ఈ రిస్క్ తో ఎంతవరకు సేఫ్ అవుతారో చూడాలి.
Follow
Follow
Post a Comment