పుష్ప 2 రిలీజ్ డేట్.. ఇలా అయితే 1000 కోట్లు కష్టమే?


పుష్ప 2 విడుదల డేట్ పై మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ అయితే ఇచ్చేసింది. 2024 ఆగస్టు 15వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల కాబోతోంది. అయితే ఇది పర్ఫెక్ట్ డేట్ అయినప్పటికీ అల్లు అర్జున్ వెయ్యి కోట్ల మార్కెట్ ఆశకు మాత్రం కాస్త అడ్డుపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సినిమా 15వ తేదీన విడుదలయితే మొదటి వీకెండ్ కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత రాఖీ పండుగ వినాయక చవితి ఇలా సినిమా కు మంచి హాలిడేస్ రానున్నాయి. అయితే అదే సమయంలో తమిళంలో ఇండియన్ 2 సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం కొంత సౌత్ ఇండస్ట్రీలో పుష్ప రాజ్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 

ఇక మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగం 3 విడుదల కానుంది. ఈ సినిమాకు మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. కాబట్టి అటు నార్త్ లో ఇటు సౌత్ లో పుష్పరాజ్ గట్టి పోటీని అయితే ఎదుర్కోబోతున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో 1000 కోట్లు అందుకోవాలని నిర్మాతలు హీరో దర్శకుడు గట్టిగానే ప్లాన్ వేస్తున్నారు. కానీ ఈ పోటీ ఏ మాత్రం నిజమైనా కూడా 1000 కోట్ల టార్గెట్ కు కాస్త ఇబ్బందులు ఎదురైనట్లే అని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post