బోయపాటి రామ్ కాంబినేషన్లో వస్తున్న మాస్ కమర్షియల్ మూవీ స్కంద మార్కెట్లో 100 నుంచి 150 కోట్ల మధ్యలో బిజినెస్ చేసినట్లుగా మొన్నటి వరకు బాగానే హడావిడి చేశారు. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ గానే సినిమాపై పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చింది అని సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. అయితే ఒక విధంగా ఆ తరహా వార్తలు సినిమాపై కొంత నమ్మకాన్ని పెంచినప్పటికీ అసలు కంటెంట్ పరంగా మాత్రం ఇంతవరకు ఆడియన్స్ ను ఈ సినిమా పెద్దగా ఆకర్షించింది అయితే లేదు.
ట్రైలర్ పై కూడా చాలా రకాల ట్రోల్స్ అయితే వచ్చాయి. సినిమాలో కొత్తదనం ఏమైనా ఉంటుందా అనే నమ్మకాన్ని మాత్రం ఇప్పటివరకు కలిగించలేదు. వచ్చిన పాటలు కూడా అసలు ఎలాంటి హడావిడి చేయలేదు. అసలే పాన్ ఇండియా అన్నారు కానీ తెలుగులోనే సినిమాకు అనుకున్నంత బజ్ అయితే క్రియేట్ కావడం లేదు.
సెప్టెంబర్ 15 రావాల్సిన ఈ సినిమా సలార్ వాయిదా పడడంతో 28 కి షిఫ్ట్ చేశారు. ఉన్న డేట్ ను వదిలేసుకుని ఆ డేట్ కోసం ఎందుకు అంతగా ఆసక్తి చూపించారో ఎవరికి అర్థం కావడం లేదు. అసలే ఆ డేట్కు మిగతా సినిమాల నుంచి కూడా కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు వాయిదా పడిందనే వార్తే గాని కంటెంట్ పరంగా మాత్రం సినిమాకు ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. స్కంద మరీ ఇంత సైలెంట్ గా ఉంటే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ రావడం కష్టమే.
Follow
Post a Comment