WAR 2: ఎన్టీఆర్ విలనే కానీ.. ట్విస్ట్ మాత్రం అలా..


ఒక టాలీవుడ్ హీరో బాలీవుడ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అంటే తెలుగు ఆడియోన్స్ తప్పకుండా ఫీల్ అవుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో బాలీవుడ్ హీరో ముందు తక్కువ స్థాయిలో తన్నులు తింటూ ఉంటే అసలు ఏమాత్రం తట్టుకోలేరు. ఇక గత కొన్ని రోజులుగా వార్2 సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు అనగానే చాలామందిలో ఎన్నో రకాల సందేహాలు అయితే వచ్చాయి.  

ఇక ఎన్టీఆర్ అయితే అలాంటి విలన్ పాత్ర ఉంటే ఎందుకు చేస్తాడు అనేది మరికొందరిలో కలుగుతున్న ప్రశ్న. ఏదేమైనా కూడా ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన లీకైతే ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ స్టేట్స్ తోనే కనిపిస్తాడు కానీ అది సెకండ్ ఆఫ్ వరకు మాత్రమేనట. 

హృతిక్ రోషన్ కు చుక్కలు చూపించే ప్రతి నాయకుడిగా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని చూపిస్తాడట. అయితే కథలో మాత్రం అతని టార్గెట్ కూడా ఒక మంచి కోసమే ఉంటుందని కథలో ట్విస్ట్ రివీల్ అయ్యాక ఒక ఎమోషనల్ మూమెంట్స్ తో తారక్ పై సింపతి వచ్చేలా దర్శకుడు కథను అల్లుతున్నాడట. ఇది ఈ కాలంలో రెగ్యులర్ పాయింట్ అయినప్పటికీ కూడా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తనదైన శైలిలో ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఎన్టీఆర్ ను ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో.

Post a Comment

Previous Post Next Post