OG: మరో కొత్త డేట్ పై ఫోకస్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG సినిమా ఇప్పటికే సగనికి పైగా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ ఏడాది డిసెంబర్లోనే విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ సంక్రాంతికి షిఫ్ట్ చేయాలని కూడా ఆలోచించారు. అయితే సంక్రాంతికి ముందే కొన్ని సినిమాలు బ్లాక్ చేసుకోవడం వలన ఆ డేట్ కాస్త అనుమానంగానే ఉంది.

ఈ తరుణంలో షూటింగ్ పనులలో కూడా కొంత జాప్యం జరిగే అవకాశం అయితే ఉంది. దీంతో చిత్ర నిర్మాత దానయ్య సినిమాను సమ్మర్ కి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. 2024 ఏప్రిల్ సెకండ్ వీక్ తర్వాత విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే అప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఎన్టీఆర్ దేవర రానుంది. ఇక ఆ తర్వాత పుష్ప 2 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎట్టి.పరిస్థితులలో అయితే క్లాష్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మరి ఈ క్లాష్ నుంచి OG ఇబ్బంది రాకుండా మరో డేట్ ఫిక్స్ చేసుకుంటుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post