రవితేజ ఈసారి "టైగర్ నాగేశ్వరరావు" సినిమాతో మార్కెట్ లో ఊహించని డిమాండ్ అయితే ఏర్పరచుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక సినిమాకు ఇప్పుడు తెలుగులో మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని డీల్స్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అవ్వగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరపైకి రానున్న ఈ సినిమాను కమర్షియల్ ఫార్మాట్ లో దర్శకుడు వంశీ రూపొందిస్తున్నారు. ఇక టీజర్ దెబ్బకు సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా బిజినెస్ 35 కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ 42 కోట్లకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఆంధ్ర ప్రాంతంలోని ఆరు ప్రాంతాలకు సంబంధించి కుదిరిన 18Cr రేషియో డీల్ సెట్టయినట్లు టాక్. ఇక పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు కాబట్టి సినిమా థియేట్రికల్ గా 50 కోట్లకు పైనే బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow
Post a Comment