భోళా.. నలు దిక్కులా కాంట్రావర్సీలే..!


ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఉండే మెగాస్టార్ చిరంజీవి వీలైనంత వరకు తన సినిమాలను చాలా ఫ్రెష్ ఎనర్జీ తోనే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మొదటిసారి భోళా శంకర్ సినిమా ద్వారా ఆయన సినిమాకు నలు దిక్కుల నుంచి కాంట్రవర్సీలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పరోక్షంగా కొన్ని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. 

ఇక ఆ కామెంట్స్ పై వైసీపీ నాయకులు రాష్ట్రానికి నష్టం జరుగుతోంది అనేంతలా ఊహించని స్థాయిలో అయితే విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. మరోవైపు నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వలన భోళా శంకర్ ను ఇరుకున పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఒక డిస్ట్రిబ్యూటర్ 30 కోట్లకు సంబంధించిన డీల్ పై క్లారిటీ ఇవ్వనందున విషయం కోర్టు వరకు వెళ్లింది. రిలీజ్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. 

అలాగే మరోవైపు భోళా శంకర్ తమిళ రీమేక్ వేదళంకు రీమేక్. అయితే మెగా ఫ్యాన్స్ హీరో అజిత్ ను ట్రోల్ చేయడం వలన అజిత్ ఫ్యాన్స్ కూడా శక్తి డైరెక్టర్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సినిమా కంటెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన సాంగ్స్ అలాగే టీజర్ ట్రైలర్ కూడా అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయలేదు. మరి సినిమా ఈ నాలుగు రకాల సమస్యలను దాటి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post