జాక్ పాట్.. బేబీ ఇది నిజమేనా?


బేబీ సినిమాతో ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. తెలుగులో ఇప్పటికే రెండు బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ కూడా అందుకున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆమెకు ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరోయిన్స్ కోసం వేటను మొదలుపెట్టాడు. అయితే అందులో ఒక పాత్ర కోసం బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్యను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో హీరోయినా లేక ఒక స్పెషల్ రోల్ కోసమా అనే విషయంలో అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని చర్చల్లోకి మాత్రం అమ్మడి పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఆమె దశ మారినట్లే అని చెప్పవచ్చు. రామ్ కు హీరోయిన్ గా అంటే తెలుగులో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి అటువైపు నుంచి అంతగా హైప్ అయిత్ర్ క్రియేట్ కాకపోవచ్చు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ అయితే నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. మరి ఈ బ్యూటీ కి ఎలాంటి రోల్ ఇస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post