జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. బైరా అనే క్యారెక్టర్ లో అతను కనిపించబోతున్నాడు అని ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరికొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇందులో హీరో విలన్ ఇద్దరికి కూడా బ్రదర్ బాండింగ్ ఉంటుందని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.
బైరా తీసుకున్న ఒక కఠిన నిర్ణయం ఒక జాతి ప్రజలను ఏ విధంగా ప్రభావం చేసింది ఆ తరువాత అతను ఎంత భయంకరంగా మారాడు? ఈ భయాన్ని ఎదుర్కొనేందుకు దేవర ఎలా రంగంలోకి దిగాడు అనే లైన్ తోనే ఈ సినిమా ఉంటుందని కూడా అంటున్నారు అతి భయంకరంగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో చాలా క్రూరంగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక అలాంటి పవర్ఫుల్ విలన్ ను హీరో ఎదుర్కొంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు. మరి వైరల్ అవుతున్న ఈ గాసిప్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఇక సినిమా 2024 ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.
Follow
Post a Comment