ప్లాన్ మారినా సంక్రాంతికే నాగ్ సినిమా!


అక్కినేని నాగార్జున కూడా సంక్రాంతి రేసులో చేరేందుకు సిద్ధమయ్యారు.  ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్ అలాగే హనుమాన్ వంటి సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున ఈ పోటీలో పండుగ కోసం తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్న నాగ్ మళ్ళీ ఎందుకో డ్రాప్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరో దర్శకుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

సార్, ఛలో సినిమాల పాపులర్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నాగ్ తదుపరి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. టీజర్‌ని చిత్రీకరించి, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అంటే ఆగస్టు 29న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.  
 
మేకర్స్ వెంటనే షూట్ ప్రారంభించి, అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారట. సినిమా కథ మొత్తం కూడా సంక్రాంతి నేపథ్యంలో సాగుతుందట. అందుకే ఈ సినిమా పొంగ‌ల్ పండ‌గ‌కు యాప్ట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నటీనటులు మరియు సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post