అక్కినేని నాగార్జున చాలా కాలంగా యాక్షన్‌కు దూరంగా ఉన్నారు. అతని చివరి చిత్రం ద ఘోస్ట్ 2022లో విడుదలైంది. ఆ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుండి నాగ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. విషయం ఏమిటంటే ప్రస్తుతం నాగార్జున సినిమాలేవి కూడా సెట్స్‌లో లేవు. కొన్ని నెలల క్రితం నాగార్జున తన కొత్త చిత్రానికి ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్‌ను దర్శకుడిగా ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ రైటర్‌కి, నాగ్‌కి మధ్య కొన్ని సమస్యలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌తో నాగ్ రెడీ అవుతున్నాడు. మరో మూడు నెలల పాటు దానితో బిజీ కానున్నాడు. చూస్తుంటే ఈ ఏడాది నాగ్ సినిమా ఏదీ సెట్స్‌పై ఉండదు అనిపిస్తోంది. ఇక మరోవైపు నాగ్ కోసం గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నాగ్ కు మాత్రం కథలు నచ్చడం లేదట. అలాగే మరో ఇద్దరు దర్శకుడు కూడా లిస్టులో ఉన్నారు. మరి నాగ్ ఎవరితో సినిమాను ఎనౌన్స్ చేస్తాడో చూడాలి.
Follow
Post a Comment