ఇప్పుడున్న యువ హీరోల్లో చాలా చలాకీగా అవకాశాలు అందుకుంటున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. బడా ప్రొడక్షన్స్ లలో కూడా అతనికి మంచి అవకాశాలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ దర్శకులు కూడా ఈ ఎనర్జిటిక్ హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డకు మరో ప్రముఖ దర్శకుడు అవకాశం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
బొమ్మరిల్లు పరుగు ఆరెంజ్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న భాస్కర్ ఆమధ్య అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేశాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు అతను మళ్ళీ సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అశోకవనంలో అర్జున కళ్యాణ నిర్మాత బాపినీడు ఆ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక తొందరలోనే అధికారికంగా క్లారిటీ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Follow
Post a Comment