లోకేష్ కనగరాజ్ - ప్రభాస్.. ముందు అవి ఫినిష్ అవ్వాలి!


విక్రమ్ సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్న లోకేష్ కనగరాజు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. తదుపరి సినిమా విజయ్ నటించిన లియో తో బిక్ సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ అప్పుడే చర్చించుకుంటున్నారు.

అయితే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం కంటే ముందుగా లోకేష్ కనగరాజు రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యంగా రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రాజెక్టు 2024లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మరోవైపు కార్తీతో కూడా ఖైదీ 2 సినిమా చేయబోతున్నాడు. ఇక లిస్టులో సూర్య రోలెక్స్ క్యారెక్టర్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. అది విక్రమ్ కథకు కొనసాగింపుగా ఉండబోతుంది. ఇక దానికంటే ముందు ప్రభాస్ సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమా అయితే 2026 లోనే ముందుకు వచ్చే అవకాశం ఉంది. సూర్య, కమల్ బిజీగా ఉంటే ముందుగా ప్రభాస్ స్టోరీ సెట్స్ పైకి వస్తుందని సమాచారం.

Post a Comment

Previous Post Next Post