కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ సినిమా జై భీమ్ దర్శకుడు జ్ఞాన్ వెల్ రాజా దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లీక్స్ తోనే అంచనాలు గట్టిగా పెరిగిపోతున్నాయి. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మరొక పాత్ర కోసం టాలీవుడ్ హీరో నాని అనుకున్నారు.
అయితే ఇప్పుడు సడన్ గా శర్వానంద్ పేరు వినిపిస్తోంది. దాదాపు శర్వా ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే నాని ఒప్పుకోకపోవడానికి అసలు కారణం ఆ క్యారెక్టర్ అని తెలుస్తోంది. విలన్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయి అని అందుకే నాని చేయకూడదని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక శర్వానంద్ మాత్రం క్యారెక్టర్ లో ఉన్న కంటెంట్ నచ్చడంతో పాటు సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ దొరుకుతుంది అని హ్యాపీగానే ఒప్పేసుకున్నాడట. త్వరలోనే ఈ విషయంలో అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
Follow
Post a Comment