పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి సినిమా సలార్ గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగానే బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఈ సినిమా బిజినెస్ డీల్స్ కోసం చాలామంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు పోటీపడ్డారు.
ముఖ్యంగా ప్రభాస్ ఈ బిజినెస్ డీల్స్ లో కూడా మొదట చర్చలు జరపాలని అనుకున్నాడు. తన స్నేహితుల స్థాపించిన యువి క్రియేషన్స్ కు కూడా నైజాం హక్కులు ఇప్పించడానికి మొదట రెడీ అయ్యాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా బిజినెస్ లో ఏదో విధంగా చర్చలు జరిపి సెటిల్మెంట్లు చేస్తూనే ఉన్నాడు.
ఇక ఆదిపురుష్ కొట్టిన దెబ్బతో ఇప్పుడు అసలు అటువైపు కూడా వెళ్లడానికి ఇష్టపడడం లేదట. అంతేకాకుండా కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్ కూడా సినిమా డిమాండ్ ను బట్టి క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది. ప్రభాస్ కు కూడా వాళ్ళు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదట. దీంతో సొంతంగానే ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హక్కులను భారీ స్థాయిలో అమ్ముకుంటోంది. ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే రైట్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
Follow
Follow
Post a Comment