కథ:
ఆదిత్య రాజ్ (నాసర్) ఒక మంత్రి. అయితే ఒక పెద్ద కంపెనీని అంతం చేసే నివేదికను సమర్పించడానికి విదేశాలకు వెళ్లినప్పుడు అతనికి ప్రాణహాని పొంచి వుంటుంది. ఇక అతనికి సెక్యూరిటీగా అర్జున్ (వరుణ్ తేజ్) ను నియమిస్తారు. అయినప్పటికీ మంత్రిని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? అసలు విలన్ టార్గెట్ ఏమిటి? అర్జున్ ఆదిత్య రాజ్‌ని రక్షించి, దోషులను కనిపెట్టాడా అనేది సినిమా అసలు కథాంశం.
విశ్లేషణ:
గండీవధారి అర్జున ట్రైలర్ చూస్తే సినిమా కథాంశం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర మంత్రికి ప్రాణహాని ఉంటుంది. హీరో, అతని బాడీగార్డ్ కమ్ సెక్యూరిటీ దానిని ఆపాలి. ఇక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కథ ముందుకు కొనసాగుతున్న కొద్దీ స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. దర్శకుడు హీరో విజువల్స్ వరకు తనదైన శైలిలో ప్రజెంట్ చేశారు. ఎక్కువగా హాలీవుడ్ కలరింగ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు అంతగా వర్కౌట్ కాలేదు. సినిమా హై స్టాండర్డ్ గా స్క్రీన్ పై తీసుకు రావాలని అన్ని విధాలుగా సీన్స్ ఉన్నప్పటికీ కొత్తగా చూస్తున్నాం అనే భావన అయితే కలగదు.
ఫస్ట్ హాఫ్ కథ లీడ్ తీసుకున్న విధానం ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఏదో మిస్ అయ్యిందని అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ చిన్న లేయర్ మీద సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ చివరి 30 నిమిషాలు దర్శకుడు మంచి డైలాగ్స్ కథనం తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక అర్జున పాత్రకు వరుణ్ తేజ్ సరిగ్గా సరిపోతాడు. అతను లవ్ స్టొరీలను మాత్రమే కాకుండా పూర్తిగా యాక్షన్ పాత్రలను కూడా అప్రయత్నంగా నిర్వహించగలడని నిరూపించాడు. ఏజెంట్‌గా అతని నటన, యాక్షన్ సీక్వెన్స్‌లలో అతని విరత్వం పర్ఫెక్ట్ గా సెట్టయ్యాయి.
ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రం గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలను హైలెట్ చేయనున్నట్లు చెప్పారు. కానీ కథ మూలం ఊహించని విధంగా యూ టర్న్ తీసుకుంటుంది.
ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెష్‌నెస్ లేకపోవడంతో ప్రేక్షకులు సినిమా నుండి డిస్‌కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. దర్శకుడు కథను ఆకర్షణీయంగా చెప్పడానికి చాలా కష్టపడ్డాడు. కానీ అన్ని పాత్రలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. కొన్ని పాత్రలకు ఏమంతగా గుర్తింపు ఉండదు. సాక్షి వైద్య, నరైన్, విమలా రామన్ రవివర్మ సినిమాపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు.
ఆ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర నాసర్, మంత్రి ఆదిత్యరాజ్‌గా నటించారు. మెచ్చుకోదగిన నటనను కూడా ప్రదర్శించాడు. విజువల్స్ ఆకట్టుకున్నాయి. ముఖేష్ గౌతమ్ కూడా పరవాలేదు అనిపించేలా నటించారు. ఇక సౌండ్ డిజైన్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఇక దర్శకుడు ప్రవీణ్ యాక్షన్ డ్రామాగా తెరపైకి తీసుకు రావాలి అనుకున్న గాండీవధారి అర్జున కథ పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు. ఇక నిర్మాణ విలువలు కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఓకే అని చెప్పవచ్చు. ఇక మిక్కీ జే మేయర్ తన మార్క్ కు తగ్గ వర్క్ అయితే ఈ సినిమాకు అందలేదు. ఫైనల్ గా గాండీవధారి అర్జున బిగ్ స్క్రీన్ పై గురి బలాన్ని చూపించలేకపోయాడు. మరీ ఈ సినిమా ఆడియెన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
👉వరుణ్ తేజ్ క్యారెక్టర్
👉క్లైమాక్స్ లో కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
👉రొటీన్ కథనం
👉ఫస్ట్ హాఫ్
👉ఎమోషన్ మిస్సవ్వడం
రేటింగ్: 2.25/5
Follow
Post a Comment