2000వ సంవత్సరంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన నువ్వే కావాలి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ రచనలో విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. తరుణ్ కు హీరోగా మొదటి అడుగులోనే ఆ సినిమా మంచి ట్రాక్ సెట్ చేసింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే నువ్వే కావాలి 4K వెర్షన్ లో మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 19 కోట్ల రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ అందించింది. అప్పట్లో అగ్ర హీరోలు ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకునేవారు. కానీ కొత్తగా వచ్చిన తరుణ్ సింపుల్ లవ్ స్టోరీ తో ఆ స్థాయిలో సక్సెస్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆ సినిమాలోని సాంగ్స్ కి అప్పట్లో మంచి క్రేజ్ అయితే దక్కింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment