గాండీవదారి అర్జున.. మెగా అపశకునాలు?


ఈ ఏడది మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. మళ్ళీ ఇదే ఏడాదిలో భోళా శంకర్ తో అత్యంత దారుణమైన డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇక మరోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విరుపాక్ష సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోగా బ్రో సినిమాతో ఊహించని స్థాయిలో ఫ్లాప్ అందుకుంటున్నాడు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఖాతాలో కూడా బాక్సాఫీస్ పరంగా అయితే మరో ఫ్లాప్ పడింది.

అయితే ఇప్పుడు అందరి ఫోకస్ కూడా నెక్స్ట్ మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి రాబోయే 'గాండీవదారి అర్జున' సినిమా పైన పడింది. బ్రో భోళా శంకర్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ అందుకున్న మెగా హీరోల బ్యాడ్ సెంటిమెంట్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో బిజినెస్ డీల్స్ జరగలేదని తెలుస్తోంది.

పెట్టిన బడ్జెట్కు మ్యాచ్ అయ్యేలా నిర్మాతలకు బయ్యర్ల నుంచి ఆఫర్లు రావడం లేదని గాసిప్స్ వస్తున్నాయి. అందుకు సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ట్రాక్ రికార్డ్ కారణమని తెలుస్తోంది. అతను నాగార్జునతో చేసిన ది ఘోస్ట్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యిన విషయం తెలిసిందే. ఇక హీరో వరుణ్ తేజ్ కూడా చివరగా చేసినా గని సినిమా కూడా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయ్యింది. 

పోనీ సినిమా టీజర్ పోస్టర్లు సాంగ్స్ ట్రైలర్ ఏమైనా పెద్దగా బజ్ క్రియేట్ చేశాయా అంటే ఎక్కడ అనుకున్నంత సౌండ్ వినబడడం లేదు. దీంతో ఇప్పుడు మెగా హీరోల వరుస డిజాస్టర్స్ అపశకునం ఈ సినిమాకు కూడా కలుగుతుందేమో అని మెగా ఫ్యాన్స్ కాస్త ఆప్సెట్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post