లోకేష్ కనగరాజ్.. రెమ్యునరేషన్ టాప్ హీరోలకు దిటుగా..!


ఇప్పుడు సౌత్ లో లోకేష్ కనగరాజు పేరు గట్టిగానే వైరల్ అవుతుంది. అతను సినిమా సినిమాకు ఎదుగుతున్న విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సరికొత్త తరహాలో సౌత్ ఇండస్ట్రీలో కూడా అతను మల్టీవర్స్ సినిమాలను తెరపైకి తెస్తూ ఉండడంతో యూత్లో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ అయితే పెంచుకుంటున్నాడు. ఇక రాబోయే లియో సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు అతని రెమ్యునరేషన్ గట్టిగానే పెరిగినట్లుగా తెలుస్తోంది. 

విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో అతనికి దాదాపు అందులో పారితోషకంతో పాటు షేర్ కూడా దక్కినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ సినిమాకు లోకేష్ 50 కోట్ల రేంజ్ లో ఆదాయాన్ని సంపాదించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు లియో సినిమాకు అతను రిజల్ట్ తో సంబంధం లేకుండా నిర్మాతల నుంచి 65 కోట్ల రేంజ్ లో అయితే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కనుక అతని రాబోయే మల్టివర్స్ సినిమాలకు 100 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మరి లియో సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post