రామాయణం కథను రిజెక్ట్ చేసిన స్టార్ బ్యూటీ


పౌరాణిక కాన్సెప్ట్ లతో ఇటీవల వచ్చిన చిత్రాల ఫలితాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. గుణశేఖర్ శాకుంతలం, ఓం రౌత్  ఆదిపురుష్ ఇటీవలి కాలంలో అతిపెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా రామాయణంపై మరో సినిమా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా మూడు భాగాలుగా రామాయణంపై సినిమా తీయాలని నిర్మాత మధు మంతెన ప్లాన్ చేస్తున్నారు.  

ఇక సీత పాత్ర కోసం అలియా భట్‌ని, రావణ పాత్ర కోసం కెజిఎఫ్ యష్‌ని కూడా టీమ్ సంప్రదించింది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అలియా భట్ ఈ సినిమాకు నో చెప్పిందని తెలుస్తోంది. డేట్స్ క్లాష్ అని ఆమె సన్నిహితులు చెబుతున్నప్పట్టికి ఆమె ఇలాంటి పౌరాణిక కథలను కాకుండా కాస్త హిస్టారికల్ లేదా ఎవరు చూపించని పౌరాణిక కథలను ఓకే చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. 

ఇక మరోవైపు, యష్ ఈ చిత్రంలో భాగం కావడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదని టాక్. ఇక వీరు రిజేక్ట్ చేసినా కూడా వందల కోట్ల రూపాయలతో రామాయణంపై ఓ అద్భుత చిత్రాన్ని నిర్మించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించకుండా నిజమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ రామాయణాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post