హీరోయిన్స్ లేకుండా కష్టపడుతున్న హీరోలు


సెప్టెంబర్ నెలలో రెండు డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతోంది. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక మరోవైపు నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7వ తేదీన రాబోతోంది. మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

ఈ రెండు సినిమాలకు కూడా భిన్నమైన తరహాలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్ లో మాత్రం హీరోయిన్స్ పెద్దగా కనిపించడం లేదు. ఒక విధంగా సమంత ఒక మ్యూజికల్ ఈవెంట్ లో కనిపించినప్పటికీ అనుష్క మాత్రం అసలు ఇంతవరకు సినిమా కోసం ఎక్కడ కూడా కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఇక సమంత అయితే ప్రస్తుతం న్యూ ఇయర్ కు వెళ్లిపోయి అక్కడ ఆరోగ్యం కోసం రెస్టు తీసుకుంటుంది. ఇక అనుష్క శెట్టి ఎందుకు ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. హీరోయిన్స్ ఇద్దరు లేకపోవడంతో హీరోలు మాత్రమే సినిమా ప్రమోషన్స్ మొత్తం వారి భుజంపై వేసుకున్నారు. మరి ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post