హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ పాన్ ఇండియా రేంజ్ లో వీలైనంత తొందరగా విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండడం వలన ఆ సినిమా పనులకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఇప్పట్లో సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ ను వృధా చేయకుండా దర్శకుడు క్రిష్ మరో కొత్త సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒక యువ హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఆరు నెలల్లో ఆ సినిమా షూటింగ్ అయిపోయేలా ప్రణాళిక కూడా చేసుకుంటున్నాడట. త్వరలోనే క్రిష్ తన కొత్త ప్రాజెక్టుపై అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నాడు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్, OG సినిమాలకు డేట్స్ కేటాయించాడు. ఇక హరిహర వీరమల్లు మాత్రం వచ్చే ఏడాది ఎన్నికల అనంతరం మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం క్రిష్ కొత్త కథను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
Follow
Post a Comment