రజినీకాంత్ జైలర్ రెమ్యునరేషన్.. అంత లేదు!


కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని ట్రాక్లోకి రావాలని అనుకుంటున్నాడు. చాలా కాలంగా డిజాస్టర్స్ చూస్తూ వస్తున్న కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భౌన్స్ బ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో రజనీకాంత్ కూడా జైలర్ తో సక్సెస్ అందుకునే ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. 

అయితే ఒకప్పుడు రెమ్యునరేషన్ లో అందరిని డామినేట్ చేసిన రజినీకాంత్ ఈసారి సినిమాకు మాత్రం చాలావరకు తగ్గించినట్లుగా తెలుస్తోంది అసలైతే రజినీకాంత్ 100 కోట్ల రేంజ్ లోనే పారితోషకం అందుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు చాలా మీడియాలలో కూడా జైలర్ సినిమాకు కూడా అదే తరహాలో అందుకుంటున్నట్లుగా కథనాలు అల్లేస్తున్నారు.

కానీ నిజానికి రజనీకాంత్ జైలర్ సినిమాకు 65 నుంచి 70 కోట్ల మధ్యలోనే పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా రజిని 2.0 తర్వాత చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో పెట్టిన పెట్టుబడి కి లాభాలు ఇవ్వలేదు. ముఖ్యంగా తెలుగులో కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక అందుకే తలైవా ఈసారి నిర్మాతలను రిస్క్ లో పెట్టకుండా రెమ్యునరేషన్ చాలానే తగ్గించాడు. ఇక ఈ సినిమా హిట్ అయితే తలైవా రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post