పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాపై ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ అయ్యిందో తెలిసిందే. ఏపీ మంత్రి అంబటి రాంబాబు సినిమాలోని ఒక పాత్ర తనను వెక్కిరించేలా ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సీన్స్ కే దారుణంగా హెచ్చరికలు కూడా చేశారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ రాబోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో పొలిటికల్ సెటైర్లు ఎక్కువగా ఉంటాయట.
దర్శకుడు హరీష్ శంకర్ అధికారులను ఉద్దేశించి కొన్ని శక్తివంతమైన కఠినమైన రాజకీయ డైలాగ్‌లను రాస్తున్నాడని తెలుస్తోంది. ఇక హరీష్ కూడా ఓ కథనంపై స్పందిస్తూ నిజమే అనేలా పవన్ కళ్యాణ్ స్టైల్ లోనే మ్యానరిజం ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇలాంటి వాటిని ప్రభుత్వం సహించదని, ఇలాంటివి పునరావృతమైతే చిత్ర నిర్మాతలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏపీ మంత్రి ఇప్పటికే ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించిన ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఉస్తాద్ సినిమాతో AP సార్వత్రిక ఎన్నికల 2024కి ముందు ఈ వేడి మరింత పెరగనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
Follow
Follow
Post a Comment