సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా మరికొన్ని రోజుల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ కూడా దాదాపు క్లోజ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఇక ఈసారి తప్పనిసరిగా జైలర్ సినిమాతో రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలి. ఎందుకంటే ఆయన గత 5 సినిమాలు కూడా దారుణంగా నష్టాలను అయితే కలిగించాయి.
జైలర్ సినిమా విషయానికి వస్తే ఏరియాలవారిగా థియేట్రికల్ గా హక్కులు ఈ విధంగా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో అత్యధికంగా 60 కోట్ల ధర పలికిన ఈ సినిమా కర్ణాటకలో 10 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లు, కేరళలో 5.5 కోట్లు ఇక మిగతా రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు కోట్లు రేంజ్ లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఇక ఇండియాలో 91 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 32 కోట్లతో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 120 కోట్లకు పైగా అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తప్పనిసరిగా 240 కోట్ల రేంజ్ లో అయితే గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి జైలర్ ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.
Follow
Follow
Post a Comment