వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, పేపర్ బాయ్, తను నేను వంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభించాడు. కానీ OTTలో విడుదలైన ఏక్ మినీ కథా చిత్రం మాత్రమే అతనికి కాస్త గుర్తింపు తీసుకొచ్చింది. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఈ హీరోకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ రాలేదు. ప్రేమ్ కుమార్ తో ఇప్పుడు తెలుగులో ఆరు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు ఇచ్చాడు.
ఒక విధంగా అతనికి ప్రభాస్ నుంచి గట్టి సపోర్ట్ లభించింది. ఒక తమ్ముడి తరహాలో అతన్ని ట్రీట్ చేశాడు యువీ లోనే వరుస సినిమాలు చేశాడు. ఇక ప్రాజెక్ట్ K వలన వైజయంతి తో ఏర్పడిన అనుబంధంతో వారి స్వప్న ప్రొడక్షన్స్ లో కూడా ఛాన్సులు ఇప్పించాడు. అయినా కూడా ప్రభాస్ ప్రేమ వలన అతనికి విజయాలు రావడం లేదు.
అతని గత ఆరు చిత్రాలు, మంచిరోజులొచ్చాయి, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోబన్ బాబు, అన్నీ మంచి శకునములే, అలాగే ప్రేమ్ కుమార్ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. సంతోష్ చాలా టాలెంటెడ్ యాక్టర్ అనే విషయాన్ని కాదనలేం. కానీ అతను తన లుక్స్‌పై ఫోకస్ చేయాలి, సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.
Follow
Follow
Post a Comment