ఈవారం మరికొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే మేజర్ హైలైట్ అవుతున్నాయి. కానీ వాటిపై కూడా అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు క్రియేట్ కావడం లేదు. ముఖ్యంగా వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమాను 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్లోనే నిర్మించారు. కానీ ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్స్ ఏది కూడా అంచనాలను అందుకునేలా బజ్ అయితే క్రియేట్ చేయలేదు. ఇక సినిమా విడుదల అనంతరం కంటెంట్ క్లిక్ అయితేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది.
ఇక మరోవైపు యువ హీరో కార్తికేయ కూడా ఈసారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని బెదురులంక 2012 సినిమాతో రెడీ అవుతున్నాడు. యుగాంతం అబద్దాన్ని కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరికక్కించారు. ఇక అప్పుడెప్పుడో ఆర్ఎక్స్ 100 సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తికేయ వరుస ప్లాప్స్ తో కాస్త సతమతమయ్యాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నప్పటికీ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే క్రియేట్ కావడం లేదు. ట్రైలర్ కూడా అంతంతమాత్రంగానే అనిపించింది. ఇక సినిమా క్లిక్ కావాలి అంటే కేవలం విడుదల తర్వాత కంటెంట్ మెప్పిస్తేనే బాక్సాఫీస్ వద్ద నెంబర్లు పెరిగే అవకాశం ఉంటుంది.
Follow
Post a Comment