భోళా.. తేడా కొడితే ఆ ఇద్దరు కనిపించరు?


భోళా శంకర్ సినిమాపై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు పెరగలేదు. ఈ సినిమా తమిళంలో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న వేదళంకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. అసలు ఫ్యాన్స్ కూడా ఈ రీమేక్ పై అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందులోనూ శక్తి షాడో లాంటి డిజాస్టర్స్ అందుకున్న దర్శకుడు అనగానే అసలు ఇప్పటివరకు పెద్దగా హైప్ కూడా పెరగలేదు.

ఇక దానికి తోడు సాంగ్స్ టీజర్ ట్రైలర్ కూడా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండడంతో సినిమాకు హైప్ రాలేదు. ఇక ఈ సినిమాపై కొంతమంది గట్టి ఆశలు అయితే పెట్టుకున్నారు ముఖ్యంగా నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ తో పోయిన డబ్బును ఈ సినిమాతో వెనక్కి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. మరోవైపు సుశాంత్ కూడా ఈ సినిమాతో క్రేజ్ వస్తుందేమో అని మెగాస్టార్ మీద నమ్మకంతో ఒక స్పెషల్ రోల్ చేశాడు.

ఇక వీరి పరిస్థితి ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ కు చాలా ముఖ్యం. షాడో సినిమా తర్వాత కనిపించని మెహర్ రమేష్ కు పిలిచి మరి మెగాస్టార్ అవకాశం ఇచ్చాడు. ఇక తమన్నా కూడా చాలా కాలంగా బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఆమెకు ఈ సినిమా తప్పనిసరిగా హిట్ అవ్వాలి. ఏ మాత్రం తేడా కొట్టిన ఇద్దరి భవిష్యత్తు కాస్త గందరగోళం లో పడినట్లు అవుతుంది.

Post a Comment

Previous Post Next Post