ఉస్తాద్ భగత్ సింగ్.. ఓ గుడ్ న్యూస్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయింది అని ఇటీవల మళ్ళీ కొన్ని కథనాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా పూర్తి చేయాలని గత మూడేళ్ల నుంచి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. మొదట అనుకున్న కథ క్యాన్సిల్ కావడంతో మళ్ళీ తెరి కథను తెలుగులో రీమేక్ గా చేయడానికి సిద్ధమయ్యాడు. 

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మొదట్లో చాలా హడావిడిగా మొదలైనప్పటికీ కూడా మధ్యలో ఊహించని విధంగా బ్రేకులు అయితే పడ్డాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమా ఆగిపోయింది అని ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు అని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సినిమా అసలు ఆగిపోలేదు అని త్వరలోనే మళ్లీ మరొక కీలకమైన షెడ్యూల్ తో మొదలవుతుంది అని అన్నారు. ఇక సినిమా విడుదల అనేది ఈ సంక్రాంతికి ఉండవచ్చు అని, లేదంటే కచ్చితంగా సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post