సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అవకాశాలు అందుకోవాలి అంటే సీనియర్ దర్శకులు సైతం ఎంతో కొత్తగా ఆలోచిస్తే గాని వర్కౌట్ కావడం లేదు. అలాగే ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ రికార్డ్స్ అందుకున్న సీనియర్ దర్శకులు సైతం హీరోలను ఒప్పించడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. కానీ కానీ కొంతమంది ఫ్లాప్ దర్శకులు మాత్రం వరుసగా అవకాశాలు వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
శక్తి షాడో లాంటి డిజాస్టర్ సినిమాలు తీసినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కు భోళా శంకర్ సినిమాతో అవకాశం ఎలా ఇచ్చారో ఎవరికి అర్థం కాలేదు. మొత్తానికి మెహర్ రమేష్ అయితే ఎప్పటిలానే డిజాస్టర్ అందుకున్నాడు. అయితే అదే తరహాలో గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న దర్శకుడు రమేష్ వర్మ. ఇతను ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలు తీశాడు.
ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు, ఖిలాడి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
కానీ అందులో ఏది కూడా అనుకున్నంత స్థాయిలో అయితే హిట్ కాలేదు. ఇక రాక్షసుడు అనే రీమేక్ సినిమా మాత్రం జస్ట్ హిట్ టిక్ టాక్ మాత్రమే అందుకుంది. ఇక అతనికి రవితేజ ఖిలాడి సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఇప్పుడు అవకాశాలు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్లో రమేష్ వర్మ శివోహం అనే సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇది బాలీవుడ్లో బుల్ బులియా మూవీకి రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. అసలు అందులో ఏం చూసి రిమేక్ చేస్తున్నారు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అప్పటికి కూడా ఈ దర్శకుడు అవకాశాలు అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Follow
Follow
Post a Comment