అనుష్క శెట్టి నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. యువి క్రియేషన్స్ బ్యానర్లో పి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అసలైతే ఈ ఏడాది సమ్మర్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తీవ్రమైన పోటీ ఉండడంతో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఇక మొత్తానికి ఈసారి మాత్రం సినిమాలో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం అనుష్క శెట్టి దాదాపు 6 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక విధంగా ఈ సినిమాకు ఆమెకు హీరో నవీన్ పోలీస్ శెట్టి కంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్. ఇక ఈ సినిమాలో నవీన్ కంటే అనుష్క రోల్ చాలా ప్రత్యేకంగా ఉంటుందట. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇద్దరికీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Follow
Post a Comment