వైసిపి మంత్రి అంబటి రాంబాబు ఇటీవల బ్రో సినిమాపై చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఊహించని విధంగా కలెక్షన్స్ చెబుతూ సినిమా డిజాస్టర్ అంటూ అలాగే ఈ సినిమాపై పెట్టుబడులు ఏ విధంగా పెట్టారు? అలాగే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? అంటూ ఈ తరహా కామెంట్స్ చేయడం కూడా చాలా వైరల్ అయింది. ఆ తరహా కామెంట్స్ పై బ్రో చిత్ర నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కూడా ఊహించిన విధంగా పవర్ఫుల్ హెచ్చరికలు జారీ చేయడం వైరల్ అవుతుంది.
ఆ కామెంట్స్ ను నేను ఆరోపణలుగా భావించడం లేదు అని వాటిని గాలి మాటలుగా వదిలేసి లైట్ తీసుకుంటున్నట్లుగా స్మైల్ ఇచ్చారు. అంతేకాకుండా ఒకవేళ తాను ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం స్టోరీ మరోలా ఉంటుంది అని, తన వద్ద చాలా బలమైన లీగల్ టీం కూడా ఉంది అని ఆ రూట్లో వెళితే మాత్రం అంబటిని అంతకంటే కిందకు దించగలను అని విశ్వప్రసాద్ ఊహించని స్థాయిలో చేసిన కామెంట్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. చాలా కూల్ గా మాట్లాడుతూనే ఆయన మంత్రికి హెచ్చరికలు జారీ చేసినట్లుగా అనిపిస్తోంది. మరి ఈ కామెంట్స్ పై మళ్లీ అంబటి రాంబాబు ఏవైనా వ్యాఖ్యలు చేస్తారో లేదో చూడాలి.
Follow
Post a Comment