బ్రో, భోళా.. నెక్స్ట్ ఈ మెగా హీరో ఏం చేస్తాడో?


మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 50 కోట్లకు పైగా నేను నష్టాలను కలిగించే అవకాశం అయితే ఉంది. ఇక బ్రో సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే బాక్సాఫీస్ వద్ద లాభాలను అందించలేకపోయింది. అయితే ఈ రెండు మెగా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాకపోవడంతో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా నెక్స్ట్ రాబోయే మెగా హీరో పైనే పడింది. 

వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున అనే సినిమాతో రాబోతున్నాడు. చివరగా ఈ హీరో గని సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఇక గాండీవదారి అర్జున సినిమాను డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు గత సినిమా ది గోస్ట్ కూడా డిజాస్టర్ అయ్యింది. కాబట్టి ఈ కాంబినేషన్ పై ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే బజ్ క్రియేట్ కాలేదు. ఇక సినిమాను అయితే ఇదే నెలలో 25వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. అలాగే మరికొన్ని రోజుల్లో మరో మెగా హీరో వైష్ణవ తేజ్ ఆదికేశవ సినిమాతో రాబోతున్నాడు.

Post a Comment

Previous Post Next Post