దేవర: కొరటాల కాదు.. ప్రతీ షాట్ వెనుక అతని నిర్ణయమే..?


జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న దేవర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సోలోగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకోవాలని ఎన్టీఆర్ గట్టిగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే చాలా చర్చలు జరిపి షూటింగ్ స్టార్ట్ చేశారు. 

అయితే ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ అయినప్పటికీ కూడా ఏదైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ఫైనల్ చేసిన తర్వాతనే షార్ట్ ఓకే అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులోనే ఒక ప్రత్యేకమైన సెట్ లో సముద్రానికి సంబంధించిన సన్నివేశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ టీం కూడా ఈ సినిమా కోసం వర్క్ చేస్తోంది. ఇక పర్ఫెక్ట్ షార్ట్ వచ్చిన తర్వాతనే జూనియర్ ఎన్టీఆర్ ప్యాకప్ చెపుతున్నాడట. 

ఈ సినిమాలో సముద్రంపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మొత్తం హైలెట్ కాబోతోందట. పూర్తిస్థాయిలో కాన్ఫిడెంట్ గా అనిపించేంతవరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదట. కొరటాల శివ కొన్ని షాట్ ఓకే అని చెప్పినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తనకు నచ్చితే గాని ఫైనల్ చేయడం లేదని తెలుస్తోంది. మరి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post