మహేష్ బాబు గుంటూరుకారం సినిమా మరో కీలకమైన షెడ్యూల్ ను ఫినిష్ చేసేందుకు త్రివిక్రమ్ గ్యాంగ్ గట్టిగానే సిద్ధమవుతోంది. మహేష్ బాబు కూడా హాలిడేస్ నుంచి తిరిగి రావడం వలన సినిమాకు సంబంధించిన మొదటి పాట అప్డేట్ కూడా వీలైనంత త్వరగా ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన షూటింగ్ 35 శాతానికి పైగా పూర్తయినట్లుగా తెలుస్తోంది.
అయితే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మిగిలిన 65% షూటింగ్ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది ఆసక్తిగా మారుతుంది. అంటే సంక్రాంతికి అనుకున్నప్పటికీ దాదాపు ఇంకా 140 రోజులు ఉంది. ఇంకా మిగిలిన షూటింగ్ ను కనీసం 75 రోజులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. 2021లో మొదలైన ఈ కాంబో సినిమా కోసం ఇప్పటివరకు కేవలం 35 రోజులు మాత్రమే వర్క్ చేసినట్లుగా సమాచారం. ఇక మిగిలిన 75 రోజుల్లోనే మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలి అంటే మళ్ళీ ఎక్కడ కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకూడదు. మరి ఈ సమయాన్ని త్రివిక్రమ్ ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment