ప్రభాస్ సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కూడా ఇంకా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు అని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి సాంగ్ సిద్ధమయ్యింది. కానీ ఇంకా దాన్ని విడుదల చేసే డేట్ మాత్రం ఫిక్స్ చేసుకోలేదు అలాగే ట్రైలర్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా మొత్తం రన్ టైం చాలా ఎక్కువ స్థాయిలో వచ్చినట్లు సమాచారం. మూడున్నర గంటలకు పైగా రాగా దాన్ని ఫైనల్ రన్ టైంలో 3 గంటలు 7 నిమిషాలకు ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు మూడు గంటల కంటే తక్కువ స్థాయిలోనే సినిమాని ఫిక్స్ చేయాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మరో 10, 15 నిమిషాల వరకు ఎడిటింగ్లో తీసే ఛాన్స్ ఉందట. మొత్తంగా రెండు గంటల 50 నిమిషాలకు అటు ఇటుగా సినిమా థియేటర్లోకి రాబోతున్నట్లు సమాచారం.
Follow
Post a Comment