మలయాళం ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా దుల్కర్ సల్మాన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. మహానటి సీతారామం సినిమాలతో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు కింగ్ ఆఫ్ కోత అనే సినిమాతో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు. ఇక మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విషయాన్ని తెలిసిందే.
అయితే దుల్కర్ సల్మాన్ ప్రభాస్ సినిమాలో కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి ప్రముఖ నటులు స్పెషల్ క్యారెక్టర్స్ తో కనిపించబోతున్నారు అని క్లారిటీ వచ్చేసింది. అయితే దుల్కర్ సల్మాన్ కూడా సెకండ్ హాఫ్ లో ఒక పది నిమిషాల పాటు కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow
Post a Comment