కీరవాణి.. వణుకు పుట్టించే మ్యూజిక్!


తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీతం పరంగా బెస్ట్ ట్యూన్స్ ఇవ్వగల అతికొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్లలో కీరవాణి ఒకరు. శాస్త్రీయ సంగీతం నుంచి పాటలను అందించడంలో ఆయన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక చాలాకాలం తర్వాత ఆయన ఒక సినిమాకు పది పాటలకు కంపోసింగ్ చేయడం జరిగింది. చంద్రముఖి 2 సినిమాకు కీరవాణి వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో దర్శకుడు పి వాసు 10 పాటలు ఉండేలా కీరవాణితో ట్యూన్స్ రెడీ చేయించాడు.

ఇప్పటికే ఓ పాట విడుదల కాగా అది పర్వాలేదు అనిపించింది. అయితే ఇందులో పాటలు ఎలా ఉన్నా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం భయాన్ని కలిగించేలా ఉంటుందట. కీరవాణి యాక్షన్ సినిమాలకు థ్రిల్లింగ్ అనిపించేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రముఖి సినిమాలో వింటేజ్ మ్యూజిక్ తోనే ఒక తెలియని భయాన్ని కలిగిస్తాడని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫిదా అవ్వాల్సిందే అని అంటున్నారు. మరి ఈ సినిమాతో కీరవాణి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post