నాగబాబు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గాయాన్ని మిగిల్చిన సినిమా ఆరెంజ్. అయితే అదే సినిమాను మళ్ళీ రిలీజ్ చేయగా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా కొట్టిన దెబ్బలు మాత్రం ఆయన ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పటివరకు సంపాదించుకున్నది అలాగే అప్పులు చేసినది మొత్తం కూడా ఆ సినిమా పోగొట్టేసింది. అప్పట్లో ఆయన ఆ సినిమా ద్వారా సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా వచ్చాయి అని చెప్పారు.
అయితే నాగబాబు ఇటీవల మళ్ళీ అలాంటి అపజయాన్ని ఎదుర్కొనే ఒక ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గాండీవదారి అర్జున సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ అందుకుంది. దీంతో వరుణ్ తేజ్ కెరియర్ లోనే ఆ సినిమా అత్యధిక తక్కువ స్థాయిలో ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
రీసెంట్ గా వరుణ్ తేజ్ ఏ సినిమా కూడా అంత తక్కువ రేంజ్ లో కలెక్షన్స్ అయితే అందుకోలేదు. అయితే మొదట ఈ సినిమాకు బివిఎస్ఎన్ ప్రసాద్ తో పాటు నాగబాబు కూడా పార్టనర్ గా సినిమాను నిర్మించాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఏమైందో కానీ ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకముందే ఆయన వెనక్కి తగ్గారు. లేదంటే మరో ఆరెంజ్ లాంటి గాయాన్ని ఎదుర్కొనే వారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు గండీవదారి అర్జున సినిమా మాత్రం భారీ నష్టాలు కలిగించే మరో సినిమాగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.
Follow
Follow
Post a Comment