విజయ్ దేవరకొండ.. ఏడాది టైమ్ లో 3 సినిమాలు


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఊహించిన విధంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఇక తదుపరి సినిమాలతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకుని ట్రాక్లోకి రావాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు వరుసగా తన మూడు సినిమాలను అయితే లైన్లో పెట్టాడు

ఇక మూడు సినిమాలు కూడా ఒక ఏడాది టైంలోనే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. ముందుగా ఖుషి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకునే సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్టర్ చేశాడు. ఇక మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. 

ఇక జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా 2024 సమ్మర్ కు విడుదల కాబోతోంది. ఈ విధంగా ఒక ఏడాది టైంలోనే విజయ్ దేవరకొండ వరుసగా మూడు సినిమాలను విడుదల చేస్తున్నాడు. మరి ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post