మొదటి సినిమాతోనే గ్లామరస్ బ్యూటీగా మంచి గుర్తింపును అందుకున్న శ్రీ లీల ఆ తర్వాత దమాకా సినిమాతో మంచి బాక్సాఫీస్ సక్సెస్ చూసింది. ఇక అమ్మడికి ఇప్పుడు ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా అవకాశాలు వస్తున్నాయి. అసలు తీరిక లేకుండా కష్టపడుతున్న ఈ బ్యూటీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక మరికొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆమె చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి.
మహేష్ బాబు "గుంటూరు కారం" నితిన్ "ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్" అలాగే వైష్ణవ్ తేజ్ "ఆదికేశవ", రామ్ పోతినేనితో "స్కంద", బాలకృష్ణతో "భగవత్ కేసరి", నితిన్ వెంకీ కుడుముల ప్రాజెక్టు.. ఇలా వరుసగా సినిమాలతో అమ్మడు చాలా బిజీగా మారిపోయింది. ఇక వచ్చే ఆరు నెలల్లో వివిధ రకాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో అమ్మడు మరింత హాట్ టాపిక్ గా నిలవబోతోంది.
ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు 1 కొట్టిన్నర నుంచి రెండు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న ఆమె కేవలం ఈ ఆరు నెలల్లో సమయంలోనే 9 నుంచి 10 కోట్ల రేంజ్ లో ఆదాయాన్ని పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక చేతిలో ఉన్న సినిమాల్లో మినిమం అన్నీ కూడా కమర్షియల్ సినిమాలే. అందులో ఒక మూడు సినిమాలు హిట్ అయిన అమ్మడు రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్ళిపోతుంది.
Follow
Follow
Post a Comment