TBO Exclusive: టైగర్ నాగేశ్వరరావు.. రియల్ క్యారెక్టర్ లోనే రేణు దేశాయ్..!


స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరపైకి రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై ఇటీవల అంచనాలు మళ్లీ ఒకసారిగా పెరిగిపోయాయి. సినిమాకు సంబంధించిన టీజర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే గట్టిగానే క్రియేట్ చేసింది. ముఖ్యంగా రవితేజ కెరీర్ లోనే ఇది బిగెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సినిమాలో రేణు దేశాయ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆమె ఏ పాత్ర చేస్తుంది అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.

కొంతమంది చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితంలో చాలామంది దొంగలను మంచిదారిలో పెట్టడానికి అప్పట్లో కొంతమంది నాస్తిక సమాజానికి చెందిన వారు ప్రయత్నాలు చేశారు. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తూ మంచిదారిలో పెట్టాలి అని అనుకున్నారు. అయితే అందులో లవణం, హేమలత అనే ఇద్దరు దంపతులు కూడా ఉన్నారు. నిజజీవితంలో టైగర్ నాగేశ్వరరావును మార్చేందుకు హేమలత ఎంతగానో ప్రయత్నం చేశారట. ఇక ఆ పాత్రలోనే రేణు దేశాయ్ నటిస్తోంది. ఇక టైగర్ నాగేశ్వరరావు కథను కమర్షియల్ హంగులతో చాలా హై రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమాలో రేణు దేశాయ్ ఆ పాత్రను ఎలా హైలెట్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post