ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సక్సెస్ చూసి చాలా కాలం అయింది. రోబో సినిమా తర్వాత మళ్లీ ఆయన కమర్షియల్ గా ఎలాంటి విజయాన్ని అందుకోలేదు. ఇక ఆ సక్సెస్ లేక దాదాపు 10 ఏళ్లు కావడంతో జైలర్ సినిమాపై కూడా పెద్దగా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఏమి క్రియేట్ కాలేదు. ఈ సినిమా కంటెంట్ ఏదైనా క్లిక్ అయింది అంటే కేవలం తమన్న పాట కాస్త వైరల్ అవ్వడమే. అది కూడా ఆడియన్స్ ను ధియేటర్ల వరకు తీసుకువస్తుందా లేదా అనేది రిలీజ్ తర్వాత గాని తెలియదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రజినీకాంత్ సక్సెస్ కొట్టాల్సిందే.
ఒకప్పుడు రజనీకాంత్ సినిమా వస్తోంది అంటే చాలా హడావిడిగా ఉండేది. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఉదయం 4 గంటలకు షోలు మొదలయ్యేవి. కానీ ఈసారి అలా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఉదయం షోలు ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక తమిళనాడులోనే అలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు రజనీకాంత్ సినిమా వస్తుందన్న విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. దానికి తోడు తెలుగులో కూడా ప్రమోషన్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అతను చివరగా చేసిన విజయ్ బీస్ట్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. దీంతో తెలుగులో ఈ సినిమాకు పెద్దగా మార్కెట్ ఏర్పడలేదు. మరి ఈసారి జైలర్ సినిమాతో అయినా కంటెంట్తో మెప్పిస్తాడో లేదో చూడాలి.
Follow
Post a Comment