వెయ్యి మంది రాక్షసులు.. ప్రభాస్ ను మరో ప్రభాస్ కాపాడితే..?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా గ్రాండ్ గా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఇప్పటివరకు రెగ్యులర్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు. కానీ సినిమాపై రోజురోజుకు అంచనాలు గట్టిగానే పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో సంబంధించిన లీక్స్ కూడా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి.

ఇక సినిమాలో ఉండే యాక్షన్ సీన్స్ కూడా ఊహించని స్థాయిలోనే ఉంటాయట. ఈ సినిమాలో ఇద్దరు ప్రభాస్ లు ఉంటారు అని ఇది వరకే ఒక గట్టి టాక్ అయితే వినిపించింది. ఒక యాక్షన్ సీన్ లో అయితే దాదాపు 1000 మంది రౌడీలు ఒక ప్రభాస్ పై అటాక్ చేయడానికి సిద్ధమవుతారట. ఇక అతను పోరాడిన అలసిపోయి డేంజర్ లో ఉన్న పరిస్థితుల్లో మరొక ప్రభాస్ వచ్చి మిగిలిన విలన్స్ ను ఊచకోత కోస్తాడని తెలుస్తోంది. 

సినిమాలో తండ్రి కొడుకులు గానే ప్రభాస్ రెండు పాత్రలు చేస్తాడని తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ సీన్ లో తండ్రి నీ కొడుకు కాపాడుతాడా? లేదంటే కొడుకును తండ్రిని కాపడతాడా? అనేది చూడాలి. బాహుబలి లో కూడా ప్రభాస్ రెండు పాత్రలు చేశాడు. కానీ ఫ్రేమ్లో ఇద్దరూ ఒకేసారి కనిపించలేదు. మరి సలార్ ఇద్దరు ఒకేసారి కనిపిస్తే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ఆడియన్స్ ఊహలకు వదిలేయడం బెటర్.

Post a Comment

Previous Post Next Post