పవన్ తో హరీష్ సడన్ ట్విస్ట్?


భవదీయుడు భగత్ సింగ్ సినిమా స్క్రిప్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో హడావిడిగా ఉస్తాద్ భగత్ సీంగ్ ప్రాజెక్టును మొదలుపెట్టాడు. అయితే ఆ ప్రాజెక్టుకు కొద్ది రోజులు షూటింగ్ అవ్వగానే మళ్లీ బ్రేకులు పడ్డాయి. అసలు ఎందుకు ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి అనే విషయంలో ఎవరికీ అర్థం కాలేదు. డేట్స్ అడ్జస్ట్ చేయలేకనా? లేదంటే స్క్రిప్ లో మార్పులు కావాలని అడిగారా అనే సందేహాలు అయితే చాలని పుట్టుకొచ్చాయి.

ఇక ఏది ఏమైనప్పటికీ కూడా హరీష్ శంకర్ ఇటీవల మంగళగిరిలో మరోసారి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తప్పనిసరిగా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలి అని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను దర్శకుడు కోరినట్లుగా టాక్. ఇక హరీష్ శంకర్ వివరణ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారట. తప్పకుండా ప్రాజెక్టును పూర్తి చేద్దామని కొన్ని పొలిటికల్ మీటింగ్స్ తర్వాత తాను రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటాను అని మాట కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును 2024 లోనే ఎలక్షన్స్ కంటే ముందే రిలీజ్ చేసేలా ప్లాన్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post