పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG సినిమాను ఫినిష్ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నాడు. అలాగే మరోవైపు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయడంతో పాజిటివ్ రియాక్షన్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. OG సినిమాతో పాటు భవదీయుడు భగత్ సింగ్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని పవన్ కళ్యాణ్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాను 4 నెలల్లోనే పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారు. అయితే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి క్లాష్ అవుతాయని టాక్ వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు సినిమాకు పోటీగా వెళతాడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అంతే కాకుండా మహేష్ బాబుతో కూడా పవన్ కళ్యాణ్ కు ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. కాబట్టి ఈ పోటీకి పవన్ ఒప్పుకోడు అని అర్థమవుతోంది. మరి నిర్మాతలు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.
Follow
Post a Comment