శక్తి తరువాత.. మళ్ళీ వాళ్ళతో ఎన్టీఆర్?


జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిన సినిమాలలో శక్తి ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించింది. ఆ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ అదే కాంబినేషన్లో కంత్రి అనే సినిమా చేశాడు. అది కూడా అంతగా ఆడలేదు. అయితే వైజయంతి మూవీస్ తో మంచి అనుబంధం ఉండడంతో ఎన్టీఆర్ ఎప్పటి నుంచో వారితో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

ఇక వైజయంతి అధినేత అశ్వినీ దత్ కూడా కథల కోసం వేట మొదలు పెట్టారు. ఇక వారి లిస్టులో ఎక్కువగా తమిళ దర్శకులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో వెట్రి మారన్, అట్లీ కూడా ఉన్నారు. ముఖ్యంగా అట్లీ తోనే వైజయంతి ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. వీటి తరువాత వైజయంతి తో చేసే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post