సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హోదా ఏ రేంజ్ కు పెరిగినా కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలి మ్యాన్ గా కొనసాగున్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలకు సంబంధించిన ప్రతీ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక గుంటూరు కారం సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మహేష్ గతంలో ఎప్పుడు లేనంత హాలిడేస్ కోసం బ్రేకులు తీసుకున్నాడు. గుంటూరు కారం సినిమా విషయంలో ఈ మాత్రం డౌట్స్ వచ్చినా కూడా మహేష్ ఓపెన్ గా చెప్పేసి విదేశాలకు వెళుతున్నాడు.
రీసెంట్ గా మ్యూజిక్ విషయంలో కూడా మహేష్ సంతృప్తి చెందకపోవడంతో ఒక షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇక మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. అనంతరం సినిమాటోగ్రఫర్ విషయంలో కూడా మార్పులు జరిగాయి. థమన్ కూడా డౌటే అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఓకే అయ్యాడు. ఇక మహేష్ ఈ నెల 16న హాలిడేస్ కు బ్రేక్ ఇచ్చి ఇండియాకు తిరిగి రానున్నాడు. అనంతరం ఆగస్టు 20 నుంచి గుంటూరుకారం షూట్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక అంతకంటే ముందు 11 నుంచి హీరో లేకుండా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ షూట్ చేయనున్నారు.
Follow
Post a Comment