బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను చివరగా చేసిన పఠాన్ సినిమా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందీ తెలుగు భాషల్లో కలుపుకొని 50 కోట్లకు పై గానే గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు జవాన్ సినిమాపై మంచి డిమాండ్ అయితే పెరిగింది.
ఇక ఈ సినిమాను తెలుగులో మంచి మార్కెట్ ఉన్న దర్శకుడు అట్లీ తెరపైకి తీసుకు వస్తూ ఉండడం అలాగే సినిమాలో నయనతార విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారికి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉండడంతో సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బయ్యర్ల నుంచి మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఇక నిర్మాతలు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 24 కోట్ల రేంజ్ లోనే అమ్మేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం. అంటే సినిమా సక్సెస్ కావాలి అంటే దాదాపు 40 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి ఆ స్థాయిలో జవాన్ సినిమా తెలుగు బయ్యర్లకు ప్రాఫిట్స్ అందిస్తుందో లేదో చూడాలి.
Follow
Post a Comment