జైలర్ అసలు కథ.. ఇది నిజమైతే హిట్టే..


కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసారి జైలర్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అతనికి కూడా ఈ సినిమా హిట్ కావడం చాలా ముఖ్యం. ఇక ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ లోనే ఉన్నారు.

కానీ సినిమాపై అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు పెరగలేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక లీక్ స్టోరీ వైరల్ గా మారింది. సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో స్టోరీలు వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం ఒక జైలర్ గా ఉన్న రజినీకాంత్ పాత్ర పేరు ముత్తు వెల్ పాండియన్.

జైలర్ గా రిటైర్ అయిన తర్వాత తన ఆరేళ్ల మనవడితో ఆనందంగా ఉంటాడు. కొడుకు అసిస్టెంట్ కమిషనర్ గా చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అతను హఠాత్తుగా మాయం అవ్వడంతో ఎంత ప్రయత్నం చేసినా కూడా జాడ దొరకదు. ఇక కొడుకు జాడ కోసం రంగంలోకి దిగిన మాజీ జైలర్కు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.

దాని వెనుక చాలా పెద్ద ముఠామే ఉంది అని ముత్తు వెల్ కు తెలుస్తుంది. ఇక తన ఆరేళ్ల మనవడితో కూడా సెంటిమెంట్ చాలా బలంగానే ఉంటుందట. ఇక తన జైలర్ అనుభవంతో ముత్తువేల్ కొడుకును కనుగొన్నాడా? అసలు ముఠా వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది సినిమాలో అసలు పాయింట్ అని తెలుస్తోంది.

ఇంతకుముందు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ మనవడి పాత్రతో కూడా బాగానే ఎమోషన్ ను పండించాడు. అది బాగా కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కూడా అదే తరహాలో వెళుతున్నాడు. ఇక జైలర్ సినిమాలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ కూడా గెస్ట్ పాత్రలలో కనిపించబోతున్నారు. లీకుల ప్రకారమైతే సినిమా కంటెంట్ క్లిక్ అయ్యేలానే కనిపిస్తోంది. మరి వెండితెరపై దర్శకుడు ఏ విధంగా ప్రజెంట్ చేశాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post